Home » కూర్మగ్రామం
kurma gramam

మన భారత దేశం లో, కొన్ని వందల సంవత్సరాల క్రితం మరుగున పడినది , మన పూర్వీకుల భక్తిమయ మైన జీవన విధానం. మల్లి మనకు, మన భావితరాలకు ఈ భక్తిమయ మైన జీవన విధానం పరిచయం చేయడానికి ఏర్పడిన గ్రామ మే ఈ కూర్మగ్రామము.

కూర్మగ్రామం, ఇక్కడి జీవన విధానానికి ఏమిటంత ప్రత్యేకత అనుకుంటున్నారా?

అయితే భగవత్ గీత లో శ్రీకృష్ణ పరమాత్మా చెప్పినటువంటి

చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః |
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ||

నాలుగు వర్ణముల వారు శ్రీకృష్ణ పరమాత్మా నుండే వచ్చాయ ని, వారు వారు చేసే వృత్తుల ను బట్టే వారి కులములు ఏర్పడ్డాయి అని అర్ధం.

శ్రీకృష్ణుడు ఈ శ్లోకములో చెప్పిన విధంగానే, ఇక్కడి వర్ణ ఆశ్రమ జీవన విధానం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారి పూర్వ ఆశ్రమ కులముల తో పని ఉండదు. ఇక్కడికి వచ్చాక అందరు కూడా వైష్ణవ సంప్రదాయమైన జీవన విధానం గడుపుతూ వారి ప్రతిభ కు అభిరుచి కి తగ్గ పనిని సేవ భావం తో చేస్తారు.

ఒకరు వేదము నేర్పే గురువుగా, ఒకరు వ్యవసాయము చేసి రైతు గా, ఒకరు బట్టలు నేసే వారిగా, ఇంకొకరు వడ్రంగి గా ఇలా ఎవరి అభిరుచి మరియు సామర్ధ్యమునకు తగిన పనిని వారు చేస్తారు. డబ్బు తో పనిలేకుండా ఒకరికి ఒకరు సహాయపడుతూ ఇక్కడి జీవనం సాగిస్తున్నారు.

కుర్మగ్రామం లోని వారి జీవన విధానం

2018లో ఇస్కోన్ సంస్థలో భక్తి వేదాంత స్వామి వారి ఆదేశంమేరకు, భక్తి వికాస్ స్వామి వారి సారథ్యం లో ఈ కూర్మగ్రామము ఏర్పడింది. ఇక్కడ ఉంటున్న ప్రతీ ఒక్కరు పూర్వము అన్ని సౌకర్యాల ను అనుభవించిన వారు. ఆ యాంత్రిక జీవనానికన్నా ఈ భక్తిమయ జీవనము ఎంతో బాగుంది అని తలచి ఇక్కడనే స్థిరపడ్డారు.

కూర్మగ్రామము పచ్చని ప్రకృతి, కొండల మధ్య లో ఎంతో ప్రశాంతం గా ఉంటుంది. ఇక్కడి గ్రామస్థులు వారి జీవనానికి అవసరము అయ్యే తిండి, బట్ట, ఇల్లు మరియు చదువు అన్ని వారే సమకూర్చుకుంటారు. ఇక్కడ చేసే వ్యవసాయం, నేసే బట్టలు, కట్టే ఇల్లు, చెప్పే చదువు అన్ని మన పూర్వపు భారతీయ పద్ధతులలోనే ఉంటాయి.

యంత్రాలు మరియు రసాయనములు అవసరం లేకుండా ఇక్కడ వ్యవసాయం చేస్తారు. అట్లాగే పెద్ద పెద్ద మచిన్స్ అవసరంలేకుండా వారి బట్టలను వారే నీసుకుంటారు. ఇల్లు కూడా పూర్వపు పద్దతులలో మట్టి ,ఇసుక, సున్నం తో ఎంతో పటిష్టముగా కట్టుకుంటున్నా

కూర్మ గ్రామము లోని గురుకులంలో చదువు ఎలా చెపుతారు

ఇక పిల్లల చదువు విషయము కు వస్తే భాగవతంలో ప్రహ్లదుడు చెప్పినటువంటి

చదివించిరి నను గురువులు |
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ ||
జదివినవి గలవు పెక్కులు |
చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ !

అని ప్రహ్లదుడు చెప్పిన ఈ శ్లోకానికి సరిపోయే విధంగా, వీరి చదువు ఆ భగవంతుని తెలుసుకోవటానికే అన్నట్లుగా ఉంటుంది.

ఇక్కడి పిల్లలకు గురుకులాల్లో రామాయణం, భాగవతం, భగవత్ గీత మొదలైన పురాణాల ను శాస్త్రాలను నేర్పుతారు. చదువు అనేది ఇక్కడ కేవలం మనం ఆ భగవంతు డిని తెలుసుకోవడానికి, ఆయన చెప్పిన మార్గం లో నడవడానికి ఉపయోగపడే లా ఉండాలి అనే వీరు నమ్ముతారు.

కుర్మా గ్రామము వంటి వర్ణ ఆశ్రమాలు ఇంకా ఎక్కడ వున్నాయి?

ఇస్కోన్ సంస్థ వారు, ప్రజలందరికి ఈ భక్తిమయ జీవన విధానం తెలియాలి అనే ఆశయం తో, భారతదేశం లోని నాలుగు రాష్ట్రాలలో, ఇటువంటి గ్రామాల ను ఏర్పాటు చేసారు.

  • గుజరాత్ లో నంద గ్రామము
  • ఆంధ్రప్రదేశ్ లో కూర్మగ్రామము
  • మద్యప్రదేశ్ లో భక్తి గ్రామం
  • పంజాబ్ లో బద్రిక ఆశ్రమము

కూర్మగ్రామము ఎలా వెళ్ళాలి?

శ్రీకాకుళం జిల్ల లోని శ్రీముఖలింగ క్షేత్రానికి సుమారుగా 6kms దూరం లో ఈ కూర్మ గ్రామము వున్నది. ఈ గ్రామాని కి వెళ్ళాలి అనుకునే వారు ముందుగా శ్రీకాకుళం చేరుకోవాలి.
అక్కడి నుండి మనకు శ్రీముఖలింగం వరకు బస్సులు ఉంటాయి. శ్రీముఖలింగం నుండి మనం ఆటో లో ఈ కూర్మగ్రామానికి వేళ్ళ వచ్చు. లేదా శ్రీకాకుళం నుండే ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకొని వెల్లవచ్చు.

కూర్మగ్రామం వసతి సదుపాయాలు ఉన్నాయా ?

కూర్మగ్రామం లో వసతి మరియు భోజనము ఉచితం. కానీ ఇక్కడి ఉండాలి అనుకుంటే కచ్చితం గా వీరి నియమములను పాటించాలి.

స్త్రీలు వొంటరిగా ఇక్కడ ఉండటానికి అనుమతి లేదు. వారు ఖచ్చితముగా వారి తండ్రి, లేదా సహోదరులు, లేదా భర్త తో ఉండాలి.

అలాగే ఆశ్రమము లో వున్నంతవరకు ఖచ్చితముగా వీరితోపాటు తెల్లవారిజామున 3:30 నిద్ర లేచి వారితో పాటు దైవ ఆరాధన సేవాకార్యక్రమాలు చేయవలసి ఉంటుంది.

ఇక్కడి వసతి సదుపాయాలు గురించి మరిన్ని వివరాలకు ఈ కింది ఫోన్ నుంబర్లను సంప్రదించండి. లేదా వారి వెబ్సైట్ లింక్ చూడండి.

  • 9676145063
  • 7069515259
  • 8712701776

మీకు వీరే ఆలయాల వివరాలు కావలి అనుకుంటే మా కామెంట్ బాక్స్ లో మాకు తప్పక తెలపండి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page