Home » తిరుమల తిరుపతి దేవస్థానం శ్రవణం  
ttd sravanam

తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తున్న సేవా కార్యక్రమాలలో, ఓ గొప్ప కార్యక్రమం శ్రవణం.  

దీని ద్వారా మన తెలుగు రాష్ట్రాలలో చెవిటి మరియు మూగ వారైన చిన్నారులకు ఉచితంగా వైద్యం చేసి వారు కూడా సాదారణ పిల్లల్లాగా వినటం మరియు మాట్లాడేలా చేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. 

పాత రోజుల్లో వినికిడి శక్తి, మాటలు రాని పిల్లలకు వైద్య సేవలు లేకపోవటం వలన ఇక వినపడదు, మాటలు రావు అని అనుకునే వారు.  కానీ ఇప్పడు అటువంటి పిల్లలకు టి టి డి శ్రవణం ఒక గొప్ప వరంలా మంచి అవకాశం కల్పిస్తుంది. 

ఇక్కడ జాయిన్ అయిన పిల్లలకు Latest technology ద్వారా 03 సంవత్సరాలు పాటు వైద్య శిక్షణ ఇచ్చి మామూలు పిల్లల్లాగా మాట్లాడేలా చేస్తారు. 

ఈ వీడియో లో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం!

 

శ్రవణంలో చేరిన చిన్నారులకు శిక్షణ ఏ విధంగా ఉంటుంది?

చిన్నారులు వినలేక పోవటం, మాట్లాడలేక పోవడం వంటి లోపాల్ని 3 నుండి 4 సంవత్సరముల లోపల గుర్తించి ఇక్కడకు తీసుకువెళ్లాలి.  

Audiological Testing ద్వారా పిల్లలను పరీక్ష చేసి వారు ఎంత శాతం వినగలుగుతున్నారు అని నిర్ధారణకు వస్తారు.  తరువాత పిల్లలలో ఉన్న ఈ వినికిడి సమస్యను తల్లి తండ్రులకు పూర్తిగా తెలియచేస్తారు.  

Speech Therapy ద్వారా 03 సంవత్సరాలు వైద్య శిక్షణ తో పాటుగా ఆట పాటలతో పిల్లలును మాట్లాడేలా చేస్తారు.  

ఇక్కడ శిక్షణ ఇచ్చే వారంతా B. Ed Special Education (Hearing Impairment)  చేసి Diploma in Teaching Young Hearing Impaired (DTYHI) Chennai లొ ప్రత్యేకంగా training తీసుకున్న వారే ఉంటారు.ఇక్కడ ఉండే చిన్నారికి ,తల్లికి మంచి భోజనం తో పాటు వసతి సదుపాయాల ను ఉచితంగా అందిస్తుంది టి టి డి.

శ్రవణంలో చిన్నారులను జాయిన్ చేయడానికి కావలసిన పత్రాలు ఏమిటి?

Admissions సంవత్సరం మొత్తం జరుగుతూనే ఉంటాయి. పిల్లలను జాయిన్ చేయాలి అంటే 

చిన్నారి, తల్లి తండ్రుల యొక్క ఆధార్ కార్డ్,

ఫ్యామిలీ రేషన్ కార్డ్,

ఇన్కమ్ సర్టిఫికేట్,

02 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోస్ 

ఫ్యామిలీ ఫోటో,

డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్,

వినికిడి లోపం ఉన్నట్లు డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ తో ఆఫీసు వర్కింగ్ టైమ్ లో వెళ్తే Admissions దొరుకుతుంది. 

మరింత సమాచారం కొరకు ఈ చిరునామా మరియు ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు..

Address: TIRUMALA TIRUPATI DEVASTHANAM SARAVANAM 

               SRI VENKATESWARA SCHOOL FOR HEARING IMPAIRED

               JCQ7+PM9, 

               Sarojini Devi Rd, 

               Srinivasa Nagar, 

               Nehru Nagar, 

               Tirupati, 

               Andhra Pradesh 517501

 

Working Hours:  Mon – Sat 

        9 am to 3.30 pm

Phone: 0877 226 4290


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page