Home » గరుడ గమన తవ స్తోత్రం
Garuda Gamana Tava

గరుడ గమన తవ  స్తోత్రము ఎంతో శక్తివంతమైన శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రము.  దీనిని  శృంగేరి పీఠాధిపతులైనా శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు భారతీ తీర్థ స్వామి వారు రచించారు.  ఈ స్తోత్రము నందు శ్రీమహావిష్ణువుని ఎంతో  అద్భుతముగా కీర్తించారు. గరుత్మంతుని అధిరోహించిన ఆ శ్రీమహావిష్ణువుని వర్ణన  చేస్తారు.

గరుడ గమన తవ స్తోత్రమును విన్నప్పుడు మనసుకి ఎంతో శాంతిని ఇస్తుంది.  శ్రీ భారతీ తీర్థ స్వామి వారు ఎంతో  లలితముగా ఈ స్తోత్ర రచనను చేశారు. ఎవరైనా సులభముగా ఆ శ్రీమహావిష్ణువుని కీర్తించడానికి వీలుగా ఉంటుంది. 

గరుడ గమన తవ

గరుడ గమన తవ చరణకమలమిహ
మనసిల సతు మమ నిత్యం
మనసిల సతు మమ నిత్యం !!

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!

1. జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత-పదపద్మ – 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

2.భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీ – 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

3.శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ – 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

4.అగణిత గుణగణ అశరణశరణద
విదళిత-సురరిపుజాల- 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీ తీర్థం – 2

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ

గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!

మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!

గరుడ గమన తవ అన్న ఈ స్తోత్రాన్ని ఏకాదశి రోజు కానీ, గరుడ పంచమి రోజు కానీ శనివారం రోజు కానీ లేదా ఏదైనా నైమిత్తిక తిథి నాడు కానీ పారాయణ చేయటం ఎంతో శ్రేయస్కరం.


1 thought on “గరుడ గమన తవ స్తోత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page