Home » శ్రీ వరహ నరసింహ స్వామి ఆలయం, సింహాచలం
varaha lakshmi narasimha swamy temple

మన తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో సింహాచలం ఒకటి. ఈ క్షేత్రంలో స్వామి వారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిగా కొలువైయున్నారు. అయితే ఇక్కడ మనం స్వామి వారి ఆలయ చరిత్ర, విశేషాలతో పాటుగా ఏ విధంగా అక్కడికి చేరుకోవాలి మరియు వసతి సౌకర్యాల గురించి కూడా తెలుసుకుందాం. 

సింహాచల ఆలయ చరిత్ర:

ప్రహ్లాదుడిని ఎలా  అయినా చంపాలని, తండ్రి అయిన హిరణ్యకశ్యపుడు , ప్రహ్లదుడిని సముద్రంలో పడవేసి బయటికి రాకుండా ఒక పర్వతాన్ని వేయమని ఆదేశించాడు.  ఒక పెద్ద పర్వతాన్ని ప్రహ్లదుడి మీద వేయబోగా శ్రీమహావిష్ణువు వచ్చి ఆ పర్వతాన్ని కోపంతో ఊదగా ఆ పర్వతం కొన్నిమైల్ల దూరంలో పడింది. ప్రహ్లదుడిని కాపాడి స్వామి ఈ పర్వతము మీద తాను శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిగా కొలువై ఉంటానని చెప్పి స్వయంభుగా ఆవిర్భవించారు. శ్రీమహావిష్ణువు యొక్క నోటి ఊపిరి చేత కొట్టబడింది, కాబట్టి ఆ పర్వతానికి సింహశైలము అని పేరు వచ్చింది. 

హిరణ్యకశ్యపుడు మరణించిన తరువాత ప్రహ్లదుడు స్వామిని ఈ కొండ మీదనే సేవించేవాడని చెపుతారు. ఇక్కడ వున్న స్వామి వారిని చూడటానికి 33కోట్ల దేవతలు, పరమశివుడు మరియు నదులు కూడా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడికి వచ్చాయి. ఆ పరమేశ్వరుడే  తాను ఇక్కడ త్రిపురాంతక స్వామి పేరుతో  క్షేత్రపాలకుడై వుంటాను అని అన్నారని, అలాగే గంగా యమునా సరస్వతి కూడా గంగ ధారా అన్నపేరుతో ప్రవహిస్తూ తమని స్వామివారి పూజాది కార్యక్రమాలలో ఉపయోగించాలని కోరుకుంటాయి. అని మనకు పురాణములు చెపుతున్నాయి.

చందనోత్సవం

ఇక్కడ స్వామి వారికి వైశాఖ త్రితీయ, అనగా అక్షయ తృతీయ నాడు చందనోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆ రోజు స్వామి వారు భక్తులకు స్వస్వరూపంలో దర్శనం అందిస్తారు. సంవత్సర కాలంలో కేవలం అక్షయ తృతీయ రోజున మాత్రమే స్వామి వారి దర్శనం, చందనం లేకుండా భక్తులకు కలుగుతుంది. ఈ ఉత్సవం గురించి మనకు పురాణగాధ వున్నది.

చందనోత్సవం పురాణగాధ

కృతయుగం పూర్తియై ప్రహ్లాదుడు స్వామి వారిలో ఐక్యమైన తరువాత, స్వామి వారి మూలమూర్తికి  పుట్ట పట్టేసింది. తరువాత త్రేతాయుగం కాలంలో పురూరవ చక్రవర్తి మరియు ఊర్వశి విమానంలో వెళ్తూన్నప్పుడు, విమానము కొండపైన ఆగిపోయింది. అప్పుడు ఊర్వశి తాను దేవతలతో కృత యుగంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం ఇక్కడ చేసినట్టు, ఆ స్వామి వారి దివ్య మహిమవలనే ఈ విమానము ఆగిన విషయం పురూరవ చక్రవర్తికి చెప్పినది. దానితో చక్రవర్తి స్వామివారి మూలమూర్తి కొరకు ఈ కొండపైన 3 రోజులపాటు వెతకగా పుట్టలో స్వామి వారి దర్శనం వైశాఖ శుద్ధ తదియ నాడు జరిగినది. అప్పుడు పురూరవ చక్రవర్తి ఆ పుట్టను ఆవు పాలు పోసి కరిగించి మూల మూర్తిని బయటకు తీశారు. అంతట ఆ నరసింహ స్వామి తన నిజరూప దర్శనం కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే అందిస్తానని, మిగిలిన తిధులలో తనను చందనం తో కప్పివేయాలని కోరారు. ఆ నాటినుండి నేటివరకు ప్రతియేటా స్వామి కేవలం చందనోత్సవం జరిగే అక్షయ త్రితీయ నాడు మాత్రమే తన స్వస్వరూపాన్ని భక్తులకు అందిస్తారు. 

సింహాచలం ఏ విధంగా వెళ్ళాలి

విశాఖపట్నం బస్ స్టాండ్ నుండి సుమారు 18 – 20 KM ల దూరంలో సింహాచలం వుంది. మన తెలుగు రాష్ట్రాల నుండి విశాఖపట్నం వెళ్ళడానికి మనకి ఎనో ట్రైన్స్ మరియు బస్సు సదుపాయాలు వున్నాయి. సింహాచలం వెళ్ళాలి అనుకువాళ్ళు ముందుగా విశాఖపట్నం చేరుకొని అక్కడినుండి మనకి అనేక బస్సులు సింహాచలం కొండపైకి వున్నాయి. అలాగే మనం ఆటో లేదా క్యాబ్ ద్వారా కూడా చేరుకోవచ్చు.

సింహాచలంలో వసతి

సింహాచలంలో దేవస్థానం వారి రూమ్స్ అందుబాటులో ఉంటాయి. దీని కొరకు మనం దేవస్థానంలో కానీ  లేదా Online AP మీసేవ website లోని ఎండోన్మెంట్ విభాగంలో గాని బుక్ చేసుకోవచ్చు. మనకి సింహాచల దేవస్థానం వారి రూమ్స్  Rs.200/- నుండి Rs.2000/- దాకా ఉంటాయి.

గోవింద శరణాగతి మాల (గోవింద నామాలు) చదువుట లేదా వినుట కొరకు క్లిక్ చేయుము.


1 thought on “శ్రీ వరహ నరసింహ స్వామి ఆలయం, సింహాచలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page