Home » హనుమాన్ ప్రదక్షిణ మంత్రం
హనుమాన్ ప్రదక్షిణ మంత్రం

హనుమ గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పవలసిన హనుమాన్ ప్రదక్షిణ మంత్రము

స్వామి హనుమ ప్రధానంగా ప్రదక్షిణముల వలన తొందరగా ప్రీతి పొందుతారని శ్రీ పరాశర సంహిత లో చెప్పబడినది. 

మనం ప్రదక్షణ ఎలా చేయాలి, వాటి నియమాలు ఏమిటో మన పురాణములలో చెప్పినవి అన్నీ, హనుమద్ వైభవం రూపంలో శ్రీ పరాశర సంహిత లో చెప్పబడినది. 

హనుమాన్ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడకూడదు.  నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడుస్తూ, ప్రదక్షిణ చేయాలి. గబ గబా నడవటం, గెంతులు వేస్తూ పరుగులు తీయటం చేయరాదు.

హనుమాన్ ప్రదక్షిణ మంత్రం చెబుతూ స్వామి వారి గుడి చుట్టూ  ప్రదక్షిణాలు చేస్తే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా  కలుగుతుంది,  అని శ్రీ పరాశర సంహితలో చెప్పబడినది.

హనుమాన్ ప్రదక్షిణ మంత్రము

ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం |
తరునార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహమ్ ||

ఈ శ్లోకం చదువుకుంటూ 108, 21, 16, 9, 7, 5, 3 ఇలా మన శరీరం సహకరించిన మేరకు ప్రదక్షిణాలు చేయవచ్చు.  ఒక వేల ఓపిక లేకపోతే 1 మాటు అయిన శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణ చేయాలి.

హనుమాన్ ప్రదక్షిణ మంత్రం చెపుతూ, ఎవరయితే స్వామికి ఈ విధంగా ప్రదక్షిణ చేస్తారో, వారికి ధర్మభద్ధమైన కోరిక ఏదైనా తీరుతుంది, అని  శ్రీ పరాశర సంహిత లో చెప్పబడినది.

ఏ రోజు ప్రదక్షిణ స్వామి హనుమాకు ప్రీతికరం?

హనుమ వైశాఖ మాసం కృష్ణ పక్ష దశమి మంగళవారం నాడు జన్మించారు. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ ప్రదక్షిణ మంత్రం చెప్తూ ప్రదక్షిణములు చేయటం చాలా మంచిది. స్వామి హనుమ జయంతి రోజున కనీసం లో కనీసం 3 మాట్లు అయినా ప్రదక్షిణ చేయాలి.

ఈ రోజున స్వామి యొక్క పూజ, ఆరాధన తరువాత  సుందరకాండ పారాయణ చేయటం వలన  విశేషమైన అనుగ్రహ ఫలితం కలుగుతుంది. 

జై శ్రీ రామ్! 

మీ సలహాలను మరియు సూచనలను ఈ క్రింది కామెంట్ రూపంలో తెలుపగలరు.


3 thoughts on “హనుమాన్ ప్రదక్షిణ మంత్రం

  1. శ్లోకం లో typing తప్పులు, క్రింద తెలుగు టైపింగ్ లో అక్షరాల తప్పులు, అన్నీ సరిదిద్దండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page