Home » రాఖీ పౌర్ణమి
Rakhi Pournima

రాఖీ పౌర్ణమి శ్లోకం

రాఖీ పౌర్ణమిని, శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రాఖీ అనగా రక్షణ బంధం అని అర్థం వస్తుంది. రాఖీ పండుగ రోజు సోదరి ముందుగా తన తమ్ముడు లేదా అన్న వద్దకు చేరుకొని, తన సోదరుడు అభివృద్దిలోకి రావాలని దేవుడిని ప్రార్ధన చేసి, బొట్టు పెట్టి, అక్షతలు వేసి, ఆశీర్వదించి సోదరుని చేతికి రాఖీ కట్టే టప్పుడు.

“యేన భద్దో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేన త్వమభి బద్నామీ రక్ష మాచల మాచల”

అనే రాఖీ శ్లోకాన్ని చదువుతూ ఆప్యాయంగా రాఖీ కడతారు. దీనికి బదులుగా సోదరుడు జీవితంలో ఎల్లవేళలా కష్టసుఖాలలో అండగా ఉంటానని ఆశీర్వదిస్తారు. తరువాత ఎంతో సంతోషంగా సోదరులకు హారతి ఇస్తారు. ఎప్పుడు కలకాలం సంతోషంగా ఉండాలని ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించు కుంటారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉత్సాహంగా రాఖీ జరుపుకుంటారు.

రాఖీ పౌర్ణమి కథ

రక్షాబంధనం జరుపుకోవడానికి పురాణాల్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం శచీదేవి తన భర్త దేవేంద్రుడు రాక్షసులపై యుద్ధంలో గెలవాలని పార్వతీ పరమేశ్వరులును, లక్ష్మీనారాయణులను, ప్రార్థన చేసి తన భర్త చేతికి శ్రావణ పౌర్ణమి రోజున రక్షను కడుతుంది. ఇదే మొట్టమొదటి రాఖీ అని పెద్దలు చెబుతారు.

అలాగే ద్వాపరయుగంలో ఒకరోజు ద్రౌపతి దేవి శ్రీకృష్ణుడి ఇంటికి వెళ్ళినప్పుడు, అనుకోకుండా శ్రీకృష్ణ భగవానుడి వేలుకు గాయమవుతుంది. అప్పుడు ద్రౌపదీదేవి ఆవిడ పవిటకొంగును చించి శ్రీకృష్ణుని వేలుకు కడుతుంది. అప్పుడు కృష్ణ భగవానుడు ఆపద సమయంలో ఆవిడకి రక్షగా ఉంటానని మాట ఇస్తారు. ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో శ్రీకృష్ణుడు ఆవిడకూ చీరలు ఇచ్చి ఆవిడను కాపాడతారు. ద్రౌపది దేవి శ్రీకృష్ణుని చేతికి కట్టి నా కట్టుకుని ఒక అన్నకు చెల్లెలు కట్టిన రక్షణ అంటారు.

రాఖీ జరుపుకోవడానికి కారణంగా విష్ణుపురాణం లోని ఒక సంఘటన ని కూడా ఆధారంగా చెబుతారు. శ్రీ మహావిష్ణువు వామన మూర్తిగా వచ్చి బలిచక్రవర్తి దగ్గర ముల్లోకాలనూ దానంగా పుచ్చుకుని ఇంద్రునికి ఇస్తారు. బలిచక్రవర్తి యొక్క దాన గుణమునకు సంతోషించిన శ్రీమహావిష్ణు పాతాళలోకములో బలిచక్రవర్తి యొక్క ద్వారపాలకునిగా ఉంటానని మాటఇస్తారు. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లేరని బాధపడుతుంది. అప్పుడు ఆవిడ శ్రావణ పూర్ణిమ రోజున బలిచక్రవర్తి వద్దకు ఒక బ్రాహ్మణ స్త్రీ గా వెళ్లి ఆయన చేతికి ఒక రక్షణ తాడును కడుతుంది. అప్పుడు బలి చక్రవర్తి ఏదైనా కోరిక కోరమని అడుగుతారు. ఆవిడ ద్వారపాలకుడు గా ఉన్న శ్రీమహావిష్ణువుని తనతో పంపమని అడుగుతుంది. వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని బలిచక్రవర్తి తెలుసుకొని, విష్ణువుని లక్ష్మీ దేవితో వైకుంఠానికి వెళ్లమని కోరుకుంటారు. శ్రీ మహాలక్ష్మీ దేవి బలిచక్రవర్తి కి కట్టిన ఈ రక్షణ తాడుని కూడా అన్నకు చెల్లెలు కట్టిన రక్షాబంధనముగా భావిస్తారు.

రాఖీ పండుగ గొప్పదనం

ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉపనయనం అయిన వారు పాత జంద్యాల ను తీసి కొత్త జంద్యాల ను గాయత్రి దేవి ఆరాధన చేసి ధరిస్తారు. అందుకే జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. జంధ్యాల పౌర్ణమి గురించి ప్రవచనం వినాలి అనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి

రాఖీ పౌర్ణమి పండుగ అన్నాచెల్లెళ్ల మరియు అక్కాతమ్ముళ్ల యెంతో ప్రేమతో యెదురుచూసే పండుగ. అక్కాతమ్ముళ్ల మరియు అన్నాచెల్లెళ్ల మధ్యన అనుబంధాలకు, ప్రేమానురాగాలకు సూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. సోదరి తమ్ముడు కి గాని అన్నకు గాని ఎంతో ప్రేమగా శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ కడతారు. అక్క లేదా చెల్లి తమ సోదరుడు జీవితంలో ఎంతో అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోదరుడికి రాఖీని కడతారు.
అన్నా అన్న పిలుపుకలో యెంత మాధుర్యం ఉందో ఈ వీడియో లో ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచనం చూసి ఆ మాధుర్యాన్ని మీరు కూడా ఆనందించండి.

సర్వేజనా సుఖినో భవన్తు … జై హింద్…


1 thought on “రాఖీ పౌర్ణమి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page