Home » సుందరకాండ పారాయణ విధానం
సుందరకాండ పారాయణ విధానం

రామాయణంలోని ఏడుకాండలల్లో సుందరకాండ మహోత్కృష్టమైనది. ఎటువంటి ఆపద నైనా, ఎటువంటి ధార్మిక కోరికలైనా తీర్చగలిగే అద్భుతమైన కాండ సుందరకాండ.  ఎన్నో మంత్ర సాధన రహస్యాలని, మహర్షి శ్లోక రూపంలో నిక్షిప్తం చేశారు.

అటువంటి అద్భుతమైన సుందరాకాండ కావ్యాన్ని ఎలా పారాయణ చేయాలి?, ఎక్కడ పారాయణ చెయ్యాలి? ఎప్పుడు పారాయణ చేయాలి? అన్న విషయాలను మనం తెలుసుకుందాం.

సుందరకాండను ఎలా పారాయణ చేయాలి

సుందరకాండని ఎలా పారాయణ చెయ్యాలో తెలుసుకుందాం. నిత్య సుందరకాండ పారాయణ చేసే వారు, లేదా ఏ కోరిక లేకుండా సుందరకాండ పారాయణ చేసే వారు ఆ స్వామి మీద భక్తిశ్రద్ధలతో సాధారణ పారాయణ చేయవచ్చు.

కానీ ఏదైనా కోర్కెతో కనుక సుందరకాండను పారాయణ చేసేటట్లయితే మనం తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. సాత్విక ఆహారము తినాలి, నేలపై చాప వేసుకొని పడుకోవాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, నిత్యం రామ స్మరణలో గడపాలి.

సుందరకాండలోని 68 సర్గలు పారాయణ చేసిన తరువాత యుద్ధకాండ లోని 128వ సర్గ అయినటువంటి పట్టాభిషేక సర్గ తప్పకుండా పారాయణ చేయాలి. పట్టాభిషేక సర్గ పూర్తి అయిన తర్వాత శ్రీరామచంద్రమూర్తికి స్వామి హనుమకు తప్పకుండా నైవేద్యం సమర్పించాలి.

సుందరకాండ పారాయణ ఎప్పుడు చేయాలి

సుందరకాండ పారాయణం సాధారణముగా దేశకాల నిర్ణయంతో పనిలేదు. కానీ శీఘ్ర ఫలసిద్ధికై, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశీర్ష, మాఘ, ఫాల్గుణ, మాసములు శ్రేయస్కరం. ఈ మాసములో వచ్చే విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి మరియు పౌర్ణమి తిధులు ఉత్తమము. ఈ మాసము మరియు తిది ఆది, బుధ, గురు, లేదా శుక్ర వారములు తో కలిసివస్తే ఎంతో శ్రేయస్కరం అని శాస్త్రవాక్కు.

సుందరకాండ పారాయణం ఎక్కడ చేయాలి

సుందరకాండ పారాయణమునకు నది, సాగరతీరమందు, పవిత్ర తీర్థక్షేత్రం నందు, దేవాలయము నందు, గోశాల నందు, స్వగృహము లోనూ, తులసి కోట వద్ద, దైవ ప్రార్థన మందిరము ఎంతో శ్రేయస్కరం అని శాస్త్రవాక్కు.  ప్రతిరోజూ ఒకే చోట యందు కూర్చొని పారాయణ చేయుట ఉత్తమము.

సుందర కాండని ఎన్ని రోజులు పాటు పారాయణ చేయాలి?

సుందరకాండని ఎన్ని రోజులు పాటు పారాయణ చెయ్యాలో తెలుసుకుందాం. మనకి సుందరాకాండలో 68 సర్గలు ఉంటాయి. వీటిని 1, 2, 5, 7, 9, 11, 16, 28, 68 రోజులలో పారాయణ చేయాలి. మన వీలును బట్టి సుందరకాండ ని ఒక రోజు నుండి అరవై ఎనిమిది రోజులపాటు పారాయణ చేయవచ్చు. 

శ్రీ రామానుజాచార్యులవారు సుందరకాండ పారాయణమునకు 16 రోజులు శ్రేష్ఠమని చెప్పారు. అంతేకాక ఆయన ఏ ఏ రోజు ఏ ఏ సర్గ పారాయణ చేయాలో కూడా మనకు తెలిపారు. విభీషణుడు రామాయణంలో చెప్పిన ఈ క్రింది శ్లోకమును, “కటపయాది” అనే అక్షరములను సంఖ్యలు గా మార్చే పద్ధతి ద్వారా ఆయన తెలిపారు.

శ్లో|| రాఘవో విజయం దద్వాన్ సితాపతిః ప్రభుః

శ్రీ రామానుజాచార్యులవారు ఈ క్రింది వివరించిన విధములో 16 రోజులలో సుందరకాండను పారాయణ చేయవచ్చు.

ఏ సర్గల దగ్గర పారాయణను ఆపవలెను?

సుందరకాండ పారాయణ చేసినప్పుడు ఏ ఏ సర్గల దగ్గర పారాయణము ఆపాలో మనం తెలుసుకుందాం.

1 రోజు సుందరకాండ పారాయణ:
68 సర్గలు మొత్తం పారాయణ చేయాలి.
సమయం 9 గంటల వరకు పడుతుంది.

2 రోజులు సుందరకాండ పారాయణ:
1వ రోజున 1 నుండి 35 వ సర్గ వరకు
2వ రోజున 36 నుండి 68 వ సర్గ వరకు పారాయణ చేయాలి.
సమయం రోజుకు 5 గంటల వరకు పడుతుంది

5 రోజులు సుందరకాండ పారాయణ
1వ రోజున 1 నుండి 15 వ సర్గ వరకు
2వ రోజున 16 నుండి 37 వ సర్గ వరకు
3వ రోజున 38 వ సర్గ
4వ రోజున 39 నుండి 54 వ సర్గ వరకు
5వ రోజున 55 నుండి 68 వ సర్గ వరకు పారాయణ చేయాలి.
సమయం రోజుకు 2.3 గంటల వరకు పడుతుంది

7 రోజులు సుందరకాండ పారాయణ
1వ రోజున 1 నుండి 5 వ సర్గ వరకు
2వ రోజున 6 నుండి 15 వ సర్గ వరకు
3వ రోజున 16 నుండి 27 వ సర్గ వరకు
4వ రోజున 28 నుండి 35 వ సర్గ వరకు
5వ రోజున 35 నుండి 42 వ సర్గ వరకు
6వ రోజున 43 నుండి 54 వ సర్గ వరకు
7వ రోజున 55 నుండి 68 వ సర్గ వరకు పారాయణ చేయాలి.
సమయం రోజుకు 1.5 గంటల వరకు పడుతుంది

16 రోజులు సుందరకాండ పారాయణ

1వ రోజున 1 నుండి 2 వ సర్గ వరకు
2వ రోజున 3 నుండి 6 వ సర్గ వరకు
3వ రోజున 7 నుండి 10 వ సర్గ వరకు
4వ రోజున 11 నుండి 14 వ సర్గ వరకు
5వ రోజున 15 నుండి 22 వ సర్గ వరకు
6వ రోజున 23 వ సర్గ
7వ రోజున 24 నుండి 31 వ సర్గ వరకు
8వ రోజున 32వ సర్గ
9వ రోజున 33 నుండి 37 వ సర్గ వరకు
10వ రోజున 38 నుండి 42 వ సర్గ వరకు
11వ రోజున 43 నుండి 49 వ సర్గ వరకు
12వ రోజున 50 నుండి 55 వ సర్గ వరకు
13వ రోజున  56 వ సర్గ
14వ రోజున 57 నుండి 62 వ సర్గ వరకు
15వ రోజున 63 నుండి 64 వ సర్గ వరకు
16వ రోజున 65 నుండి 68 వ సర్గ వరకుపారాయణ చేయాలి.
సమయం రోజుకు 45 నిమిషముల వరకు పడుతుంది

68వ సర్గ పూర్తి అయిన ఆఖరి రోజు తప్పకుండా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకము చదవవలెను. ఈ పట్టాభిషేక సర్గ యుద్ధకాండ లోని 128 వ సర్గ. పట్టాభిషేక సర్గ చదివి శ్రీరామచంద్రమూర్తి కి స్వామి హనుమకు నైవేద్యమును భక్తితో సమర్పించవలెను.

పారాయణ ఫలితం ఏమిటి?

సుందరకాండని భక్తిశ్రద్ధలతో చదివినా లేదా, సుందరకాండ ప్రవచనం వినిన, ఆ శ్రీరామచంద్రమూర్తి మరియు స్వామి హనుమ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మనకి ధార్మికమైన ఏ కోరికలు ఉన్న అవి నెరవేరుతాయి.

ఇందులో ఎన్నో శ్లోకాలను మాల మంత్రాలుగా పిలుస్తారు. ఈ మాల మంత్రాలు ఎంతో శక్తివంతమైనవి. అవి కేవలం చదివినా, లేదా వినినా ఫలితం ఇస్తుంది. సుందరాకాండలోనే గాయత్రీ మహా మంత్రంలోని బీజాక్షరాలను నిక్షిప్తం చేసి వాల్మీకి రచన చేశారు. అటువంటి సుందరకాండను ఎవరైతే భక్తిశ్రద్ధలతో పారాయణ చేస్తారు లేదా ప్రవచనం వింటారో, వారికి ఆ సీతారాముల మరియు స్వామి హనుమ పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. వారి యొక్క ధార్మిక కోరికలు తప్పక నెరవేరుతాయి అని శాస్త్రవాక్కు.


7 thoughts on “సుందరకాండ పారాయణ విధానం

  1. నమస్తే మేడం గారు , సుందరకాండ పారాయణ ఈ అధిక శ్రావణ మాసం లో చేయవచ్చా

  2. Hi Sir,
    I am noob to the procedures of Sundarakanda recital . So my request to you Sir- is that”by what time does the recital to be started and ended in a day”.
    Kindly take time to answer me sir.
    In the name of Sree Rama

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page