Home » సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం
subramanya bhujanga stotram

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర విశేషాలు

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని తమిళనాడు లోని తిరుచెందూర్ గ్రామములో ఆదిశంకరాచార్య గారు రచించారు. ఈ తిరుచెందూర్ క్షేత్రం లోనే సౌర పాదుడు అనే రాక్షసుడిని కుమారస్వామి సంహరించారని పద్మ పురాణము నందు చెప్పబడియున్నది ఆదిశంకరాచార్యులు ధ్యానములో నుండి ఆ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించి ఈ స్తోత్రాన్ని రచన చేశారు.

ఈ షణ్ముఖుని స్తోత్రము 33 శ్లోకాలతో ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర రూపంలో ఆది శంకరాచార్యులవారు మనకు తిరుచెందూర్ క్షేత్రం లో కొలువై ఉన్న ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఈ స్తోత్రంలో శంకరాచార్యులవారు సుబ్రహ్మణ్యస్వామి కొలువున్న తిరుచెందూర్ క్షేత్రాన్ని అక్కడి సముద్రాన్ని ఆ స్వామి మూర్తిని ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు.

భుజంగం అనగా సర్పము అని అర్థం వస్తుంది. తెలుగు రాష్ట్రాల యందు మరియు కన్నడ రాష్ట్రమునందు సుబ్రహ్మణ్యుని సర్ప రూపంలో ఎక్కువగా కొలుస్తూ వుంటారు. తమిళనాట సుబ్రహ్మణ్యుని మూర్తి ఆరాధన ఎక్కువ. 

ఈ క్రింద ఉన్న వీడియోలో చాగంటి కోటేశ్వరరావు గారు చాలా చక్కగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఎలా చదవాలో, ఆ స్తోత్రానికి అర్థం ఏమిటో వివరించారు.

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర ఫలస్తుతి

సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం యొక్క ఫలస్తుతి ఏమిటంటే దీనిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి అకాల మృత్యువు అపమృత్యువు దోషములు తొలగుతాయి అలాగే ఆయురారోగ్యాలు కలిగి జ్ఞానమును పొందుతారు.

ప్రతీరోజు నియమంగా చదువుకునే అలవాటు ఉన్నవారికి చిట్ట చివర జ్యోతి స్వరూపంతో సుబ్రహ్మణ్యడు దర్శనం ఇచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అని  ఫలస్తుతి.

సదా బాలరూపాపి విఘ్నాద్రిహన్త్రీ – మహాదన్తివక్త్రాపి పంచాస్య మాన్యా |
విధీన్ద్రాదిమృగ్యా గణేశాభిధా మే – విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తిః (1)

నజానామి శబ్దం నజానామి చార్థం – నజానామి పద్యం నజానామి గద్యమ్ |
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే – ముఖా న్నిస్సర న్తే గిర శ్చాపి చిత్రమ్ (2)

మయూరాధిరూఢం మహావాక్యగూఢం – మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం – మహాదేవబాలం భజే లోకపాలమ్ (3)

యదా సన్నిధానం గతా మానవా మే – భవామ్భోధి పారం గతా స్తే తదైవ |
ఇతి వ్యంజయ న్సిన్దుతీరే య ఆస్తే – త మీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ (4)

యథా బ్ధే స్తరంగా లయం యా న్తితుంగా – స్తథైవా పద స్సన్నిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయన్తం – సదా భావయే హృత్సరోజే గుహం తమ్ (5)

గిరౌ మన్నివాసే నరా యే ధిరూఢా – స్తదా పర్వతే రాజతే తే ధిరూఢాః |
ఇతీవ బ్రువ న్గన్థశైలాధిరూఢ – స్సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు (6)

మహామ్భోధి తీరే మహాపాపచోరే – మునీన్ద్రానుకూలే సుగంధాఖ్య శైలే |
గుహాయాం వసన్తం స్వభాసా లసన్తం – జనార్తిం హరన్తం శ్రయామో గుహం తమ్ (7)

లస త్స్వర్ణ గేహే నృణాం కామదోహే – సుమస్తోమ సంఛన్నమాణిక్య మంచే |
సముద్య త్సహస్రార్క తుల్యప్రకాశం – సదా భావయే కార్తికేయం సురేశమ్ (8)

రణద్ధంసకే మంజులే త్యన్తశోణే – మనోహారి లావణ్య పీయూషపూర్ణే |
మనషట్పదో మే భవక్లేశ తప్తః – సదా మోదతాం స్కన్ద ! తే పాదపద్మే (9)

సువర్ణాభ దివ్యామ్బరై ర్భాసమానాం – క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం – కటిం భావయే స్కన్ద ! తే దీప్యమానామ్ (10)

పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ – స్తనాలింగనాసక్త కాశ్మీర రాగమ్ |
నమస్యా మ్యహం తారకారే! తవోర – స్వభక్తావనే సర్వదా సానురాగమ్ (11)

విధౌ క్లృప్తదణ్డా న్స్వలీలా ధృతాణ్డా – న్నిర స్తేభశుండా న్ద్విషత్కాలదణ్డాన్ |
హతేన్ద్రారిషండాన్ జగత్రాణశౌండా – న్సదా తే ప్రచణ్డాన్ శ్రయే! బాహుదణ్డాన్ (12)

సదా శారదా షణ్మృగాంకా యది స్యుః – సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమన్తాత్ |
సదా పూర్ణబిమ్భా: కళంకై శ్చ హీనా – స్తదా త్వన్ముఖానాం బ్రువే! స్కన్ద! సామ్యమ్(13)

స్ఫురన్మందహాసై స్సహంసాని చంచ – త్కటాక్షావలీ భృఙ్గా సంఘోజ్జ్వలాని |
సుధాస్యన్ది బిమ్బాధరాణీశసూనో – తవాలోకయే! షణ్ముఖాంభోరుహాణి(14)

విశాలేషు కర్ణాన్తదీర్ఘే ష్వజస్రం – దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు |
మయీ షత్కటాక్ష స్సకృత్పాతిత శ్చే – ద్భవేత్తే దయాశీల! కానామ హానిః(15)

సుతాంగోద్భవో మేఽసి జీవేతి షడ్ధా – జపన్మన్త్ర మీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః – కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః(16)

స్ఫురద్రత్న కేయూర హారాభిరామ – శ్చల త్కుణ్డల శ్రీలస ద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః – పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః(17)

ఇహా యాహి! వత్సేతి హస్తా న్ప్రసార్యా – హ్వయ త్యాదరా చ్ఛంకరే మాతు రంకాత్ |
సముత్పత్య తాతం శ్రయన్త౦ కుమారం – హరాశ్లిష్ట గాత్రం భజే బాలమూర్తిమ్(18)

కుమారేశసూనో! గుహ! స్కన్ద! సేనా – పతే! శక్తిపాణే! మయూరాధిరూఢ |
పులిన్దాత్మజా కాన్త! భక్తార్తిహారిన్! – ప్రభో! తారకారే! సదా రక్ష! మాం త్వమ్(19)

ప్రశాన్తేన్ద్రియే నష్టసంజ్ఞే విచేష్టే – కఫోద్గారివక్త్రే భయోత్క౦పి గాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం – ద్రుతం మే దయాలో! భవాగ్రే గుహ! త్వమ్(20)

కృతాన్తస్య దూతేషు చణ్డేషు కోపా – ద్దహ! చ్ఛిన్ది! భింద్ధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మాభై రితిత్వం – పురః శక్తిపాణి ర్మమా యాహి! శీఘ్రమ్(21)

ప్రణమ్యా సకృ త్పాదయోస్తే పతిత్వా – ప్రసాద్య ప్రభో! ప్రార్థయేఽనేకవారమ్ |
న వక్తుం క్షమోఽహం తదానీం కృపాబ్ధే! – నకార్యా న్తకాలే మనాగ ప్యుపేక్షా(22)

సహస్రాణ్డభోక్తా త్వయా శూరనామా – హత స్తారక స్సి౦హవక్త్రశ్చ దైత్యః |
మమాన్తర్హృదిస్థం మనఃక్లేశ మేకం – నహంసి ప్రభో! కింకరోమి క్వ యామి?(23)

అహం సర్వదా దుఃఖభారావసన్నో – భవా దీనబంధు స్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం – మమాధిం ద్రుతం నాశయోమాసుత! త్వమ్(24)

అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహ – జ్వరోన్మాద గుల్మాది రోగా మహాన్త: |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం – విలోక్య క్షణాత్తారకారే! ద్రవన్తే(25)

దృశి స్కన్దమూర్తి శ్రుతౌ స్కన్దకీర్తి – ర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం – గుహే సన్తు లీనా మమాశేషభావా(26)

మునీనా ముతాహో! నృణాం భక్తిభాజా – మభీష్టప్రదా! స్సన్తి సర్వత్ర దేవాః |
నృణా మన్త్యజానా మపి స్వార్థదానే – గుహాద్దేవ మన్యం నజానే నజానే(27)

కలత్రం సుతా బన్దువర్గః పశుర్వా – నరో వా ధ నారీ గృహే యే మదీయాః |
యజన్తో నమన్త: స్తువంతో భవన్త౦ – స్మరన్తశ్చ తే సన్తు సర్వే కుమార!(28)

మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టా – స్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తి తీక్ష్ణాగ్రభిన్నా స్సుదూరే – వినశ్యన్తు తే చూర్ణిత క్రౌఞ్చశైల!(29)

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం – సహేతే నకిం దేవసేనాధినాథ! |
అహం చాతిబాలో భవాన్ లోక తాతః – క్షమస్వాపరాధం సమస్తం మహేశ!(30)

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం – నమ శ్ఛాగ! తుభ్యం నమః కుక్కుటాయ |
నమ స్సిన్ధవే సింధుదేశాయ తుభ్యం – పునః స్కన్ధమూర్తే! నమస్తే నమోస్తు(31)

జయానన్ధభూమ జయాపారధామ – జయా మోఘకీర్తే! జయానందమూర్తే! |
జయానన్ధసిన్ధో! జయాశేషబన్ధో! – జయ! త్వం సదా ముక్తిదా నేశసూనో(32)

భుజంగాఖ్య వృత్తేన క్లృప్తం స్తవం యః – పఠేద్భక్తి యుక్తో గుహం సంప్రణమ్య |
స పుత్రా న్కలత్రం ధనం దీర్ఘమాయు – ర్లభేత్స్కన్ధ సాయుజ్య మన్తే నర స్స:(33)

శ్రీ శంకర భగవత్పాద కృత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్


1 thought on “సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page