Home » శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం
vigneswara shodasha stotram

విగ్నేశ్వర షోడశ నామ స్తోత్రములో స్వామి గణపతిని 16 నామములతో పూజిస్తాము. ప్రతిరోజూ పూజ ప్రారంభం లో ఈ పదహారు నామములు  చెప్పి పూజ ప్రారంభించాలి.

విగ్నేశ్వర షోడశ నామ స్తోత్రము లో ఆ గణపతి యొక్క  గుణగణములు, వైభవమును వివరించబడినది.

ప్రతిరోజు ఎవరైతే ఈ 16 నామమునే చెప్తారు లేదా వింటారో వారికి విద్యలోనూ వివాహం లోనూ మరి ఏ ఇతర కార్యం లోనూ విఘ్నములు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు  చూసుకుంటారని ఫలస్తుతి.

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 ||

ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 ||

షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 ||

ఉద్యోగ ప్రాప్తి కొరకు శ్రీ వల్లభ గణపతి కి సంబంధించిన అద్భుతమైన స్తోత్రం శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం ఇది ఎవరైతే ప్రతీరోజు పారాయణ చేస్తారో వారికి ఉద్యోగ ప్రాప్తి మరియు అభీష్ట సిద్ధులు కలుగుతాయి.  ఇది చదవడానికి ఈ లింకు ను క్లిక్ చేయండి.


1 thought on “శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page